
వాతావరణం
జిల్లాలో ఉదయం ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోతగా ఉంటుంది. పలు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది.
హన్మకొండ కల్చరల్ : వరంగల్ హంటర్‌రోడ్డులోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, జానపద గిరిజన విజ్ఞానపీఠంలో 2025–26 విద్యాసంవత్సరానికి ఎంఏ తెలుగు రెగ్యులర్ కోర్సు ప్రవేశానికి శనివారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని జానపద గిరిజన విజ్ఞానపీఠం పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వివరాల కోసం 99891 39136, 99894 17299 నంబర్ల ద్వారా సంప్రదించాలని సూచించారు.