స్పెషలిస్ట్‌ వైద్యులతో పరీక్షలు చేయించాలి | - | Sakshi
Sakshi News home page

స్పెషలిస్ట్‌ వైద్యులతో పరీక్షలు చేయించాలి

Sep 20 2025 5:29 AM | Updated on Sep 20 2025 5:29 AM

స్పెష

స్పెషలిస్ట్‌ వైద్యులతో పరీక్షలు చేయించాలి

స్పెషలిస్ట్‌ వైద్యులతో పరీక్షలు చేయించాలి భూ నిర్వాసితులతో ఆర్బిట్రేషన్‌ 158 మంది టీచర్లకు వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌ ఓటర్‌ లిస్ట్‌పై ‘ఎస్‌ఐఆర్‌’ చేపట్టాలి ఐదుగురు ఇన్‌స్పెక్టర్ల బదిలీ

ఎంజీఎం: ప్రత్యేక వైద్య శిబిరాలపై మహిళలకు అవగాహన కల్పించి వారి సమస్యల్ని బట్టి పీహెచ్‌సీల్లో స్పెషలిస్ట్‌ వైద్యులతో పరీక్షలు చేయించాలని హనుమకొండ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి అప్పయ్య సూచించారు. ‘స్వస్థనారి స్వశక్తి పరివార్‌ అభియాన్‌’లో భాగంగా శుక్రవారం ఆయన నగరంలోని పోచమ్మకుంట పీహెచ్‌సీలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యులు శివకృష్ణ, వైద్యాధికారి డాక్టర్‌ దీప్తి, జిల్లా మాస్‌ మీడియా అధికారి అశోక్‌ రెడ్డి, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

న్యూశాయంపేట: గ్రీన్‌ఫీల్డ్‌ నేషనల్‌ హైవే 163 జి నిర్మాణంలో భూములు కోల్పోయిన నెక్కొండ మండలం అప్పలరావుపేట, పర్వతగిరి మండలం ఏనుగల్‌ గ్రామాల భూనిర్వాసితులతో కలెక్టరేట్‌లో కలెక్టర్‌ సత్యశారద అధ్యక్షతన ఆర్బిట్రేషన్‌ నిర్వహించారు. నిర్వాసితులకు అవార్డ్‌ పాస్‌ చేసేందుకు ఆర్బిట్రేషన్‌ నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి, తహసీల్దార్లు రాజ్‌కుమార్‌, వెంకటస్వామి, తదితర అధికారులు పాల్గొన్నారు.

విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని పాఠశాలల్లో 158 మంది టీచర్లను వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌ చేశారు. డీఈఓ వాసంతి వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌ ఉత్తర్వులు జారీ చేస్తారు. టీచర్ల పదోన్నతుల ప్రక్రియ ఇటీవల ముగిసింది. విద్యార్థులు ఎక్కువ మంది ఉండి టీచర్ల నీడ్‌ ఉంటే అక్కడికి ఇతర స్కూల్స్‌ నుంచి వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌ చేశారు. ఎస్‌జీటీలు 93 మందిని ఎల్పీ తెలుగు ఐదుగురు, ఎల్పీ హిందీ ఐదుగురిని, 55మంది స్కూల్‌ అసిస్టెంట్లను వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌ చేశారు. ఏమండలంలో టీచర్లను అదే మండలంలో పాఠశాలలకు 81 మందిని వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌ చేయగా ఒక మండలం నుంచి మరో మండలానికి 69 మందిని అడ్జెస్‌ చేశారు. ఈమేరకు డీఈఓ ఉత్తర్వులు జారీ చేస్తారు.

వరంగల్‌ జిల్లాలో 160 మంది టీచర్లు

వరంగల్‌ జిల్లాలోని పాఠశాలల్లో 160 మంది టీచర్లకు వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌ చేసి మూడు రోజుల క్రితమే ఆయా ఉపాధ్యాయులకు డీఈఓ రంగయ్యనాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఏ మండల పరిధి టీచర్లను ఆయా మండల పరిధి పాఠశాలలకు వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌ చేశారు. మరికొన్ని మండలాల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అవసరం మేరకు ఒక మండలం నుంచి మరో మండలానికి అవసరం మేరకు కూడా వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌ ప్రక్రియ కొనసాగుతుంది. దసరా సెలవుల అనంతరం ఆయ ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి.

హన్మకొండఅర్బన్‌/న్యూశాయంపేట: ప్రణాళిక ప్రకారం ఓటరు జాబితాపై స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి జిల్లాల ఎన్నికల అధికారులకు సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌పై అదనపు సీఈఓ లోకేశ్‌కుమార్‌తో కలిసి జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. హనుమకొండ, వరంగల్‌ కలెక్టరేట్ల నుంచి కలెక్టర్లు స్నేహశబరీష్‌, సత్యశారద పాల్గొన్నారు. సమావేశంలో హనుమకొండ అదనపు కలెక్టర్‌ వెంకటరెడ్డి, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్‌ రమేశ్‌, కె.నారాయణ, బల్దియా కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, వరంగల్‌ అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

వరంగల్‌క్రైం: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిఽధి వివిధ పోలీస్‌స్టేషన్‌, ఆయా విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు పోలీస్‌ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. సత్యనారాయణరెడ్డి (వరంగల్‌ టాస్క్‌ఫోర్స్‌–జనగాం), పి.దేవేందర్‌రెడ్డి(జనగామ–వీఆర్‌,వరంగల్‌), కె.రామకృష్ణ(వీఆర్‌–సీసీఎస్‌, వరంగల్‌), టి.గోపీ(వీఆర్‌,వరంగల్‌–సీసీఎస్‌,వరంగల్‌), వై.సంజీవరావు (సీసీఎస్‌, వరంగల్‌–సీసీఆర్‌బీ, వరంగల్‌)కు బదిలీ అయ్యారు.

స్పెషలిస్ట్‌ వైద్యులతో  పరీక్షలు చేయించాలి1
1/1

స్పెషలిస్ట్‌ వైద్యులతో పరీక్షలు చేయించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement