
రూ.59 లక్షలతో బ్రిడ్జికి మరమ్మతులు
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
కాజీపేట: కాజీపేట రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి మరమ్మతులకు రూ.59 లక్షల నిధులు మంజూరు చేయించినట్లు పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. కాజీపేట ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జిని జిల్లా అధికారులతో కలిసి శుక్రవారం సందర్శించారు. ఆయన వెంట మాజీ కార్పొరేటర్ ఎండీ అబుబక్కర్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎండీ అంకూస్, పి.ఆంజనేయులు, ఆస్గర్, బి.రమేశ్, ఇప్ప శ్రీకాంత్, డాక్టర్ రామకృష్ణ, పసునూరి మనో హర్, సిరిల్ లారెన్స్, దువ్వ రాజు పాల్గొన్నారు.
బహుజనుల బతుకమ్మకు తరలిరండి
హన్మకొండ కల్చరల్: సామాజిక ఉత్సవం బహుజనుల బతుకమ్మకు నగర ప్రజలు తరలిరావాలని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. వేయిస్తంభాల ఆలయంలో ఈనెల 29 వరకు నిర్వహించనున్న సంబురాల్లో ప్రజలు పాల్గొనాలన్నారు.