
ప్లాన్ ప్రకారమే నిర్మాణాలు ఉండాలి
వరంగల్ అర్బన్: ప్లాన్ నిబంధనల మేరకే భవన నిర్మాణాలుండాలని గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. శుక్రవారం హంటర్‌రోడ్డు, ఖమ్మం హైవేలోని ఫాదర్ కొలంబో ఆస్పత్రి ప్రాంతంలో భవన నిర్మాణ అనుమతుల మంజూరు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీపై కమిషనర్ క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. ప్లాన్, డ్యాక్యుమెంట్లు, ఎన్‌ఓసీలు తదితర సర్టిఫికెట్లను పరిశీలించారు.
ప్రణాళిక సిద్ధం చేయండి
వ్యాపార, వాణిజ్య సంస్థల నుంచి ప్రతీ మూడేళ్లకోసారి సెప్టిక్ ట్యాంక్‌ల క్లీనింగ్‌కు ప్రణాళికలు సిద్ధం చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. శుక్రవారం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.