
ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి
హన్మకొండ: తెలంగాణ రాష్ట్ర అంబేడ్కర్ యువజన సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధుపాక ఎల్లయ్య, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఏనుట్ల రవీందర్ పిలుపునిచ్చారు. ఆదివారం హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సంఘం ఆవిర్భావ దినోత్సవ కరపత్రాలను ప్రజాసంఘాల నాయకులు ఆవిష్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు వివరించారు. ఉదయం 8 గంటలకు అన్ని గ్రామాల్లో, ఉదయం 9 గంటలకు మండల కేంద్రాల్లో సంఘం పతాకాన్ని ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు. అనంతరం హనుమకొండకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా ఉత్తమ సేవలు అందించిన సభ్యులకు పురస్కారాలు అందించి సన్మానించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు రౌతు రమేశ్‌కుమార్, ఆయా సంఘాల నాయకులు వనపాకల రాజయ్య, సత్తూరి చంద్రమౌళి, కామెర లక్ష్మణ్, కలకోట్ల ప్రతాప్, మేకల ప్రవీణ్, వల్లందాస్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.