
కిక్ బాక్సింగ్ సిటీ లీగ్ చాంపియన్‌షిప్
వరంగల్ అర్బన్ : వరంగల్ బల్దియా ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఖేలో ఇండియా కిక్ బాక్సింగ్ సిటీ లీగ్ చాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. హనుమకొండ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలకు 20 జిల్లాల నుంచి 350 విద్యార్థినీవిద్యార్థులు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. మొదటిసారి సిటీ లీగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వరంగల్ డీవైఎస్‌ఓ సత్యవాణి, సెక్రటరీ కైలాశ్‌యాదవ్, కిక్ బాక్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు, ప్రతినిధులు శ్రీలక్ష్మి, మహిపాల్, బండారి సంతోశ్, తిరుపతి, మణికంఠ, వెంకటేశ్, వైష్ణవి తదితరులు పాల్గొన్నారు.