
శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించాలి
కేయూ క్యాంపస్: సమాజంలో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని కాకతీయ యూనివర్సిటీ యూజీసీ కో–ఆర్డినేటర్ ఆర్.మల్లికార్జున్‌రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండలోని యూనివర్సిటీ లా కాలేజీలో జనవిజ్ఞాన వేదిక హనుమకొండ జిల్లా కమిటీ ఐదో వార్షిక సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. సహజ వనరుల శాసీ్త్రయ వినియోగంతోనే సమగ్రాభివృద్ధి జరుగనుందని అభిప్రాయపడ్డారు. ఏ ప్రాంతంలోనైనా నీటికొరతను అధిగమించేందుకు ఇంకుడుగుంతలు, చెక్‌డ్యాంల నిర్మాణం అవసరమని పేర్కొన్నారు. చెరువుల మధ్య అనుసంధాన వ్యవస్థను ఏర్పరిస్తే భూగర్భజలాల స్థాయిని పెంచి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడవచ్చని తెలిపారు. ఎకనామిక్స్ విభాగం ఆచార్యులు అందె సత్యం మాట్లాడుతూ.. పారిశ్రామిక విప్లవం ద్వారానే ప్రపంచంలోని అనేక దేశాల జీడీపీ ఉత్పాదకత గణనీయంగా పెరిగిందన్నారు. సదస్సుకు అధ్యక్షత వహించిన రిటైర్డ్ డీఎఫ్‌ఓ కాజీపేట పురుషోత్తం, వక్తలు మర్రి యాదవరెడ్డి, డాక్టర్ సుదర్శన్‌రెడ్డి, కృష్ణానంద్, లక్ష్మారెడ్డి మాట్లాడారు. ఏడాది కాలంగా చేపట్టిన కార్యకలాపాల నివేదికను జనవిజ్ఞాన వేదిక జిల్లాప్రధాన కార్యదర్శి భిక్షపతి, ఆర్థిక నివేదికను బాధ్యులు పరికిపండ్ల వేణు ప్రవేశపెట్టారు. అనంతరం సదస్సులో పలు తీర్మానాలు చేశారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర బాధ్యులు శ్రీనాఽథ్, ఆచార్య ఆంజనేయులు, డాక్టర్ రాములు, ఉమామహేశ్వర్‌రావు, శ్రవణ్‌కుమార్, ధర్మప్రకాశ్, ప్రభాకర్‌చారి, శ్రీనివాస్, సుమలత, వందన అశోక్ ఉన్నారు.
కేయూ యూజీసీ కో–ఆర్డినేటర్ మల్లికార్జున్‌రెడ్డి