
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు అండగా ఉంటాం
● టీఎస్ ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్యాం మనోహర్
హన్మకొండ: విద్యుత్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం కృషి చేస్తుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాసరి శ్యాం మనోహర్, రాష్ట్ర సెక్రటరీ జనరల్ మేడి రమేశ్ అన్నారు. శనివారం రాత్రి హనుమకొండ విద్యుత్ నగర్‌లోని డీఐపీఈఏ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం టీజీ ఎన్పీడీసీఎల్ శాఖ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఇందులో టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 జిల్లాల నుంచి అసోసియేషన్ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు తమ సమస్యలను అసోసియేషన్ దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం టీజీ ఎన్పీడీసీఎల్ శాఖ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎ.ఆనందం, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బి.శంకర్, ప్రధాన కార్యదర్శిగా ఎన్.కుమారస్వామి ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో సంఘం వ్యవస్థాపకుడు కలకుంట్ల మాణిక్యం, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ ఆర్.నాంపల్లి, వర్కింగ్ ప్రెసిడెంట్ కె.చంద్రయ్య పాల్గొన్నారు.