
పోగొట్టుకున్న నగదు బ్యాగు అందజేత
ఖిలా వరంగల్: పోగొట్టుకున్న నగదు బ్యాగు బాధితుడికి అందజేశారు. మిల్స్‌కాలనీ ఇన్‌స్పెక్టర్ బొల్లం రమేశ్ కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన మహమ్మద్ అఫ్సర్ సెకండ్ హ్యాండ్ బొలెరో వాహనం కొనుగోలు చేసేందుకు శనివారం హైదరాబాద్ నుంచి నేరుగా మడికొండకు చేరుకున్నాడు. కన్సల్టెన్సీలో సెకండ్ సేల్స్ వాహనాలు నచ్చకపోవడంతో మడికొండ నుంచి నేరుగా ఆటో ఎక్కి వరంగల్ ఆర్టీఏ జంక్షన్‌లో దిగాడు. వాహనం కొనుగోలు కోసం వెంట తెచ్చిన రూ.3 లక్షల నగదు గల బ్యాగును ఆటోలోనే మర్చిపోయాడు. కన్సల్టెన్సీకి వెళ్లి చూసుకుంటే ఆటోలో రూ.3 లక్షల బ్యాగు మర్చిపోయానని గ్రహించి వెంటనే శనివారం సాయంత్రం మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇన్‌స్పెక్టర్ బొల్లం రమేశ్ చాలెంజ్‌గా తీసుకొని సీసీ కెమెరాలను పరిశీలించారు. బ్యాగు మరిచిపోయిన ఆటోను కనిపెట్టి కాజీపేటకు చెందిన ఆటో డ్రైవర్ యాసిన్‌ను అభినందించి, రూ.3లక్షల బ్యాగును బాధితుడు మహమ్మద్ అఫ్సర్‌కు ఆదివారం ఇన్‌స్పెక్టర్ బొల్ల రమేశ్ చేతుల మీదుగా అందజేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే బ్యాగును కనిపెట్టి బాధితుడికి అప్పగించేందుకు సహకరించిన ఎస్సై శ్రావణ్, క్రైం పార్టీ కానిస్టేబుల్ జంపాల నాగేశ్వరరావును ఏఎస్పీ శుభం, ఇన్‌స్పెక్టర్ బొల్లం రమేశ్ అభినందించారు.

పోగొట్టుకున్న నగదు బ్యాగు అందజేత