
నగరాభివృద్ధికి సీఎం ప్రత్యేక చొరవ
వరంగల్ అర్బన్: వరంగల్ నగరాభివృద్ధి కోసం సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని మేయర్ గుండు సుధారాణి అన్నారు. కేరళ ప్రభుత్వం తొలిసారిగా కేరళ అర్బన్ కాన్‌క్లేవ్–25 మేయర్‌ల ఫోరం సదస్సు శనివారం ముగిసింది. స దస్సులో సుధారాణి మాట్లాడుతూ.. నూతన మాస్టర్ ప్లాన్, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి రూ.4,170 కోట్లు, విమానాశ్రయం కోసం వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వ్యర్థాల నుంచి 6 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి, ఎఫ్ ఎస్‌టీపీలు, ఎస్టీపీలు, బయోమైనింగ్, బయో, విండో కంపోస్ట్‌ల యూనిట్ల ఏర్పాటు, కూరగాయల వ్యర్థాలతో బయో గ్యాస్ ప్లాంట్లతో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ప్రాపర్టీ టాక్స్ వసూళ్ల క్యూ ఆర్ కోడ్, బిల్డ్ నౌ ద్వారా భవనాల అనుమతులు తదితర విధానాలను అవలంబిస్తున్న తీరును వివరించారు.
కేరళ అర్బన్ కాన్‌క్లేవ్–25 సదస్సులో మేయర్ గుండు సుధారాణి