
ఖాళీ స్థలం.. ట్రాఫిక్ అస్తవ్యస్తం
కాజీపేట: కాజీపేటలోని డిజిల్ కాలనీ నుంచి ఫాతిమానగర్ మీదుగా నిట్ వరకు రోడ్లకు ఇరువైపులా రహదారుల వెంట ఖాళీగా ఉన్న స్థలాల్లో దుకాణాలు నిర్మిస్తే హాకర్ల సమస్య తీరుతోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ స్థలాల్లో కొందరు వ్యాపారాలు కొనసాగిస్తుండగా.. ఇక్కడ బలం ఉన్నోడిదే రాజ్యం అన్నట్లుగా పరిస్థితి మారింది. రోడ్లపైనే విచ్చలవిడిగా దుకాణాలు ఏర్పాటు చేసుకుని ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగిస్తున్నా.. పట్టించుకునేవారు లేకుండా పోయారు. మున్సిపల్ అధికారులతోపాటు ట్రాఫిక్ పోలీసులు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. అధికారులు పట్టించుకుంటే కార్పొరేషన్‌కు రూ.5 లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. ఈస్థలాలు ఆక్రమణకు గురవకముందే అధికారులు స్పందించాలి.