
ధర్మకర్తలను నియమించే స్వేచ్ఛ లేదా?
వరంగల్ చౌరస్తా: ‘రాష్ట్ర మంత్రి హోదాలో ఇద్దరు ధర్మకర్తలను నియమించే స్వేచ్ఛ నాకు లేదా? అధిష్టానం సూచించిన వారికే కేటాయించా’ అని దేవాదాయ ధర్మదాయ, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రశ్నించారు. శనివారం వరంగల్ ఓ సిటీలో విలేకరులతో మంత్రి సురేఖ మాట్లాడారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అదృష్టం కొద్ది గెలిచాడని, ఆయనపై తాను కామెంట్ చేయాలనుకోవట్లేదని పేర్కొన్నారు. తనపై నాయిని చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు.
రూ.3కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
తూర్పు నియోజక వర్గంలో మూడు డివిజన్లలో రూ.3 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి కొండా సురేఖ శంకుస్థాపన చేశారు. కాశిబుగ్గలో రూ.1.50 కోట్లతో నిర్మించే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి, రూ.50 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు పనులు, 26వ డివిజన్ గిర్మాజీపేటలో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు, 21వ డివిజన్ ఎల్ బీ నగర్‌లో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డు, డ్రెయిన్ పనులు ప్రారంభించారు. ప్రజా సమస్యలు తెలుసుకుని, వినతి పత్రాలు స్వీకరించారు. ఈఅభివృద్ధి కార్యక్రమాల్లో కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
హన్మకొండ కల్చరల్: వరంగల్ గిర్మాజీపేటకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ మట్టెవాడ అజయ్‌కుమార్‌కు అంతర్జాతీయ గౌరవం లభించింది. ఈమేరకు శనివారం గ్లోబల్ బుక్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇంగ్లాండ్, ఇండియా ప్రతినిధి డాక్టర్ మనీష్‌కుమార్ స్వయంగా వరంగల్‌లోని అజయ్‌కుమార్ నివాసానికి వచ్చి సర్టిఫికెట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డు, ట్రోఫీ, రికార్డు బుక్‌ను అందజేశారు. సూక్ష్మశిల్పకళలో అసాధారణ ప్రతిభకనబర్చినందుకు ఈఅవార్డు వచ్చిందని అజయ్‌కుమార్ తెలిపారు.
● నాయిని అదృష్టం కొద్ది గెలిచాడు
● మంత్రి కొండా సురేఖ

ధర్మకర్తలను నియమించే స్వేచ్ఛ లేదా?