
హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలి..
కాజీపేట అర్బన్: హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేసి మా ప్రాణాలు కాపాడండి అంటూ కడిపికొండలోని రాజీవ్ గృహ కల్ప, ఇందిరమ్మ కాలనీవాసులు వేడుకుంటున్నారు. కాజీపేట నుంచి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న కడిపికొండ టు ఖమ్మం బైపాస్ రోడ్డుకు ప్రధాన ద్వారంగా రాజీవ్ గృహకల్ప సముదాయంలోని ప్రధాన రోడ్డు నిలుస్తోంది. వీధి దీపాలు, హైమాస్ట్ లైట్ లేక చీకట్లోనే నిత్యం ప్రయాణాలు కొనసాగుతున్నాయి. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. భారీ వెహికిల్స్ నడిచే ఈ దారిలో చీకటి ఆవరించి ఉండడంతో వాహనదారులు, స్థానికులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం కొనసాగిస్తున్నారు. హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేస్తే వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా ఉంటారని స్థానికులు పేర్కొంటున్నారు.