
కలానికి సంకెళ్లేసి సత్యాన్ని నిర్బంధించలేరు!
నిఖార్సయిన జర్నలిజంతో తెలుగు పత్రికా ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టిస్తున్న ‘సాక్షి’పై ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం అక్కసు పెంచుకుందని ఉమ్మడి వరంగల్ జిల్లా పాత్రికేయులు, పాత్రికేయ సంఘాలు, ప్రజాసంఘాల నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలకు అక్షర రూపమిచ్చినందుకు సాక్షి జర్నలిస్టులపై అక్కడి ప్రభుత్వం కేసులు పెట్టించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కలానికి సంకెళ్లు వేసి సత్యాన్ని నిర్బంధించగలరా? అని వారంతా ప్రశ్నిస్తున్నారు.