
రిటైర్డ్ ఉద్యోగులకు అవకాశం కల్పించాలి
టీఎస్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్
అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి టి.ప్రభాకర్
హన్మకొండ: జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో రిటైర్డ్ ఉద్యోగులకు అవకాశం కల్పించాలని తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి తిరవరంగం ప్రభాకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండ రాంనగర్‌లోని అసోసియేషన్ కార్యాలయంలో హనుమకొండ యూనిట్ సమావేశం నిర్వహించారు. ఇందులో తిరువరంగం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఉద్యోగ జేఏసీలో 200 సంఘాలుండగా.. కేవలం 15 సంఘాలకు మాత్రమే స్టాండింగ్ కౌన్సిల్‌లో స్థానం కల్పించి మిగతా వాటిని విస్మరించడం.. విభజించి పాలించడం అన్నట్లుగా ఉందన్నారు. సర్వీస్ సంఘాలతో పాటు విశ్రాంత ఉద్యోగుల సంఘాలకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో అవకాశం కల్పించాల్సి ఉండగా విస్మరించడం విచారకరమన్నారు. అనంతరం హనుమకొండ యూనిట్ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అధికారిగా సాంబయ్య వ్యవహరించగా.. రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడిగా ఖాజామోహినుద్దీన్ వ్యవహరించారు. కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ందని వారు వివరించారు. అధ్యక్షుడిగా ఎం.మల్లారెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడిగా పి.సదానందచారి, కార్యదర్శిగా కె.సంజీవరెడ్డి, ఫైనాన్స్ సెక్రటరీగా ఎం.భిక్షపతి, ఉపాధ్యక్షులుగా పి.శ్రీరాములు, వి.సుజాత, జాయింట్ సెక్రటరీగా జగదీశ్‌చంద్రారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పి.వెంకటయ్య, పబ్లిసిటీ సెక్రటరీగా ఎం.నర్సింహాచారి, జిల్లా కౌన్సిల్ సభ్యులుగా టి.ప్రభాకర్, కె.రాజశేఖర్, కళా రాజేశ్వర్‌రావు ఎన్నికయ్యారు.