
సృజనాత్మకతను వెలికితీసేందుకే కళా ఉత్సవ్
హనుమకొండ డీఈఓ వాసంతి
విద్యారణ్యపురి: పాఠశాలల స్థాయి విద్యార్థుల్లో సృజనాత్మక ప్రతిభను వెలికితీసేందుకు కళాఉత్సవ్ దోహదం చేస్తుందని హనుమకొండ డీఈఓ వాసంతి అన్నారు. శుక్రవారం పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కళాఉత్సవ్‌ను హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో నిర్వహించారు. ఈకళా ఉత్సవ్‌ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. హనుమకొండ జిల్లా స్థాయిలో 12 అంశాల్లో కళా ఉత్సవ్ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. 14 మండలాల నుంచి 93 మంది విద్యార్థులు ప్రతిభ కనబర్చినట్లు, వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ బండారు మన్మోహన్, జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాస్‌స్వామి, హనుమకొండ ఎంఈఓ నెహ్రూనాయక్, సోషల్ స్టడీస్ ఫోరం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, హైస్కూల్ హెచ్‌ఎం జగన్, పీఎస్ హెచ్‌ఎం ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు.

సృజనాత్మకతను వెలికితీసేందుకే కళా ఉత్సవ్