
విజ్ఞాన శాస్త్రంలో మైక్రోబయోమ్ కీలకం
జాతీయ సదస్సులో కేయూ విశ్రాంత
ఆచార్యులు రాంరెడ్డి
విద్యారణ్యపురి: మానవాళి మనుగడను మైక్రోబయోమ్ నిర్దేశిస్తోందని, జీవుల జీవనాన్ని అర్థం చేసుకోవడంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని కేయూ మైక్రోబయాలజీ రిటైర్డ్ ఆచార్యులు ఎస్.రాంరెడ్డి అన్నారు. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘మైక్రోబియల్ ఫ్రాంటియర్స్ హార్నెస్సింగ్ జీనోమి క్స్ సింథటిక్ బయాలజీ అండ్ మైక్రోబయోమ్ ఇన్నోవేషన్స్’ అంశంపై శుక్రవారం నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో జీనోమిక్స్, మైక్రోబయోమ్ కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు. వరంగల్ నిట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పెరుగు శ్యాం మాట్లాడుతూ.. జీనోమిక్స్ విస్తృతమైన డేటా సెట్లను ఉత్పత్తి చేస్తుందన్నారు. సిరిసిల్ల ప్రభుత్వ వైద్యకళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రామ్మోహన్ మాట్లాడుతూ.. మన జీవన విధానంలో సమతుల్య ఆహారం నుంచి మంచి ఆరోగ్యాన్ని పొందగలమన్నారు. నాగ్‌పూర్‌లోని ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్ రీజినల్ సెంటర్ జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ.. పంటలకు రసాయన ఎరువులు, పురుగు మందులు అధికంగా వాడితే మానవాళి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయన్నారు. కేడీసీ ప్రిన్సిపాల్ ఆచార్య గుర్రం శ్రీనివాస్, జాతీయ సదస్సు కన్వీనర్ పి.పల్లవి మాట్లాడారు.