
న్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కరించాలి
టీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు
న్యూశాయంపేట: తెలంగాణలోని ఉద్యోగ, ఉపాధ్యాయ (టీజీఈ జాక్) ప్రభుత్వానికి సమర్పించిన న్యాయబద్ధమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని టీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్నమనేని జగన్‌మోహన్‌రావు డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండ టీజీఓ భవన్‌లో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వరంగల్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ముఖ్య అతిథిగా జగన్‌మోహన్‌రావు మాట్లాడుతూ.. ఇటీవల ముఖ్యమంత్రి ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లపై మాట్లాడిన మాటలు ఉద్యోగ లోకాన్ని బాధించినా టీజీఓ, టీఎన్జీఓతో పాటు వివిధ సంఘాలకు గుర్తింపునిస్తూ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేసి సమస్యలపై చర్చలకు అవకాశం కల్పించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈసందర్భంగా సమావేశంలో పలు తీర్మానాలను ఏకగీవ్రంగా ఆమోదించారు. కమిటీలో ఖాళీగా ఉన్న ఉపాధ్యక్ష పదవుల్లో బి.రాజిరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీప్రియను తీసుకున్నారు. సమావేశంలో టీజీఓ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, కార్యదర్శి ఫణికుమార్, ఇతర కార్యవర్గ సభ్యులతో పాటు హనుమకొండ జిల్లా కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్‌కుమార్, కోశాధికారి రాజేశ్‌కుమార్, శ్రీనివాస్, యాకయ్య, రాజు, రాజేశ్, సదానందం, మైదం రాజు, సతీశ్‌కుమార్ రవీందర్‌రెడ్డి, సుధీర్‌కుమార్, హేమలత, పవిత్ర తదితరులు పాల్గొన్నారు.