
ప్రమాణాలు పాటిస్తేనే అనుమతులు
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
వరంగల్ అర్బన్ : నిర్దేశిత ప్రమాణాలు పాటిస్తేనే భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తామని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ కోసం నగర పరిధిలోని బాలసముద్రం, వడ్డేపల్లి, సుబేదారి, శాయంపేట ప్రాంతాల్లో శనివారం కమిషనర్ క్షేత్రస్థాయిలో సందర్శించి భవన నిర్మాణదారులు సమర్పించిన ధ్రువపత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భవన నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునే క్రమంలో వాస్తవ సమాచారం, సూచించిన ధ్రువ పత్రాలను జత చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించిన తర్వాత సర్టిఫికెట్లు జారీ చేస్తామన్నారు. ఏమైనా తేడాలు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ఏసీపీలు రజిత, ఎర్షాద్ పాల్గొన్నారు.
రికార్డు స్థాయిలో విగ్రహాల నిమజ్జనం
నగరంలో 36 గంటలపాటు గణేశ్ శోభాయాత్రలు జరిగాయని, రికార్డు స్థాయిలో 10వేల పైచిలుకు విగ్రహాలు నిమజ్జనం చేసినట్లు కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది కంటే ఈసారి వినాయక ప్రతిమల సంఖ్య పెరగడం వల్ల శుక్రవారంనుంచి శనివారం సాయంత్రం వరకు నిమజ్జనాలు జరిగినట్లు పేర్కొన్నారు. వివిధ శాఖల అధికారులు షిఫ్టుల వారీగా విధులు నిర్వహించినట్లు తెలిపారు.
వరంగల్ జిల్లాలో 6,500 విగ్రహాలు
వరంగల్ జిల్లా వ్యాప్తంగా 6,500 వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగినట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండడంతో నిమజ్జనం ప్రశాంతంగా జరిగిందని పేర్కొన్నారు.
పోచమ్మ మైదాన్ నుంచి
చిన్న వడ్డేపల్లి చెరువు వరకు
బారులుదీరిన
వినాయక విగ్రహాలు

ప్రమాణాలు పాటిస్తేనే అనుమతులు