
కేసీఆర్ కుటుంబాన్ని రాష్ట్రంనుంచి బహిష్కరించాలి
● పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
హన్మకొండ చౌరస్తా: తెలంగాణ సెంటిమెంట్‌తో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుతిన్న కేసీఆర్ కుటుంబాన్ని, వారి బినామీలను రాష్ట్రంనుంచి బహిష్కరించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన 1,200 మంది అమరుల ఆత్మలు కవిత రూపంలో నిజాలు మాట్లాడిస్తున్నాయన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్న సొమ్ముల పంపకంలో వచ్చిన పంచాయితీలను కవిత బయట పెడుతోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన అధికారుల ఇళ్లలో సోదాలు చేస్తే వందల కోట్లు దొరికింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కవిత చేసిన ఘనకార్యానికి వరంగల్ బీఆర్‌ఎస్ నాయకులు ధర్నాలు, నిరసనలు చేయడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్‌రెడ్డి, పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, కార్పొరేటర్ జక్కుల రవీందర్, నాయకులు నాయిని లక్ష్మారెడ్డి, బంక సరళ, బంక సంపత్ పాల్గొన్నారు.