
వైఎస్ రాజశేఖరరెడ్డికి ఘన నివాళి
హన్మకొండ చౌరస్తా : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతిని పురస్కరించుకుని హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పలువురు కాంగ్రెస్ నేతలు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాల రూపంలో ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిన మహానేత వైఎస్‌ఆర్ అని కొనియాడారు. ఆయన చూపిన ప్రజా సంక్షేమ మార్గంలో కాంగ్రెస్ పార్టీ నేటికి కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాసరావు, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, మామిండ్ల రాజు, విజయశ్రీ, నాయకులు నాయిని లక్ష్మారెడ్డి, ఎస్.కుమార్‌యాదవ్, నసీంజాహన్, రహమున్నీసా, జాఫర్ పాల్గొన్నారు.