
నగరాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం..
ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ మేయర్ల సమావేశంలో మేయర్ సుధారాణి
వరంగల్ అర్బన్ : వరంగల్ నగరాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నట్లు మేయర్ గుండు సుధారాణి తెలిపారు. హరియాణాలోని కర్నాల్‌లో మంగళవారం నిర్వహించిన ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ మేయర్స్ (ఏఐసీఏం) 53వ వార్షిక సర్వసభ్యసమావేశంలో మేయర్ మాట్లాడారు. వరంగల్ నగరం యునెస్కో గ్లోబల్ నెట్‌వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్‌లో ఎంపికైందని తెలిపారు. మామునూరు విమానాశ్రయం ఏర్పాటు కల త్వరలో సాకారం కానుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 3–10 లక్షల జనాభా కేటగిరీలో వరంగల్ 3వ అత్యంత వేగంగా అభివృద్ది చెందే నగరంగా నిలిచిందన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్‌లో దేశంలో 42వ స్థానం, తెలంగాణలో 2వ స్థానంలో ఉందని ఆమె వివరించారు.