
జిల్లా ప్రజలపై క్రీస్తు దీవెనలు ఉండాలి
కాజీపేట రూరల్ : ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు లోకరక్షకుడు ఏసుక్రీస్తు దీవెనలతో సుఖసంతోషాలతో ఉండాలని అంతర్జాతీయ దైవజనులు, గొర్రెకుంట గిఫ్ట్ ఆఫ్ జీసెస్ మినిస్ట్రిస్ ఫౌండర్స్ జడ్సన్ అబ్రహం, ప్రీతా జడ్సన్‌లు ఆక్షాంక్షించారు. హనుమకొండ అంబేడ్కర్ భవన్‌లో రెండు రోజులు జరిగిన ఉజ్జీవ మహాసభలు ఆదివారం రాత్రి 12 గంటల వరకు ముగిశాయి. బ్రదర్ సామ్‌సన్ జడ్సన్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముఖ్య అతిథిలుగా వారు హాజరై బైబిల్ సందేశం చేస్తూ తాము ఇప్పటి వరకు ప్రపంచంలో 57 దేశాలలో ఏసుక్రీస్తు సువార్త పరి చర్య చేసినట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి తరలొచ్చిన ప్రజలను దైవజనులు ప్రార్థించారు. రెండురోజుల ఉజ్జీవ సభలో బ్రదర్ సామ్‌సన్ జడ్సన్ తమ క్రీస్తు గీతాలు ఆలపించి, క్రీస్తు వాఖ్యోపదేశం చేశారు. కార్యక్రమంలో పాస్టర్లు, విశ్వాసులు పాల్గొన్నారు.