
జెడ్పీ సీఈఓకు పదోన్నతి
హన్మకొండ: హనుమకొండ జెడ్పీ సీఈఓ ఎం. విద్యాలతకు ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్‌గా పదోన్నతి కల్పించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధి డైరెక్టర్ కార్యాలయంలో డిప్యూటి కమిషనర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు విద్యాలత మంగళవారం హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ స్నేహ శబరీష్, డీఆర్‌డీఓ మేన శ్రీను అమెను అభినందించారు. జెడ్పీ డిప్యూటీ సీఈఓ బి.రవి, కార్యాలయ పర్యవేక్షకులు రవిప్రకాశ్, సునీల్, ఉద్యోగులు నవీన్, గోపాల్‌సింగ్, వేణుగోపాల్, నాలుగో తరగతి ఉద్యోగులు సీఈఓను కలిసి అభినందనలు తెలిపారు.
హన్మకొండ అర్బన్ : విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మంగళవారం హనుమకొండ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి, అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు స్టాలిన్, మంద శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పట్టించుకోవడంలో పూర్తి విఫలమైందన్నారు. రాష్ట్రంలో రూ.8 వేల కోట్ల స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అదేవిధంగా పెండింగ్ ఉన్న మెస్, కాస్మొటిక్ చార్జీలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా నిర్వహిస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో సంఘం బాధ్యులు బొచ్చు కల్యాణ్, బిరెడ్డి జశ్వంత్, అనూష, పరిమళ, బొచ్చు ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య దంపతులు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ పర్యవేక్షకుడు క్రాంతికుమార్, అర్చకులు వారికి ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం అర్చకులు వారికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు.
ఎంజీఎం: ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సబ్ సెంటర్ల సిబ్బంది పనిచేయాలని హనుమకొండ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య సూచించారు. ఆశ డే సందర్భంగా 8 ఆరోగ్య కేంద్రాల పరిధిలో నమోదవుతున్న జ్వరాలు, డెంగీ పాజిటివ్ కేసులు, ఫీవర్ సర్వే, వైద్య శిబిరాల నిర్వహణ, ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా నిర్వహిస్తున్న స్క్రీనింగ్, ఎక్స్‌రే పరీక్షలను ఉప కేంద్రాల వారీగా మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ అప్పయ్య మాట్లాడుతూ పరీక్షలు, ఎక్స్‌రేలను ఇంకా ఎక్కువ సంఖ్యలో నిర్వహించాలని, పీహెచ్‌సీల్లో మందులు, టెస్టింగ్ కిట్ల లభ్యత ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. అడిషనల్ డీఎంహెచ్‌ఓ మదన్మోహన్‌రావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విజయకుమార్, డెమో అశోక్‌రెడ్డి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

జెడ్పీ సీఈఓకు పదోన్నతి

జెడ్పీ సీఈఓకు పదోన్నతి