
టూరిజం స్పాట్‌గా ఉర్సు రంగసముద్రం
న్యూశాయంపేట: వరంగల్ నగరంలోని ఉర్సు రంగసముద్రం చెరువును టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద.. అధికారులను ఆదేశించారు. మంగళవారం కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, బల్దియా కమిషనర్ చాహత్‌బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి తదితర అధికారులతో కలిసి ఉర్సుగుట్ట రంగసముద్రం చెరువును పరిశీలించారు. నగర ప్రజలు సాయంత్రం వేళలో సేదతీరేందుకు చెరువుకు ఆనుకుని రోడ్డువైపు వాకింగ్ ట్రాక్ తదితర ఏర్పాట్లు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అభివృద్ధి పనులపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఇన్నర్‌రింగ్ రోడ్డు, భూసేకరణ పురోగతి, గుండు చెరువు, నిర్వాసితులకు పరిహారం చెల్లింపు తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏకవీరదేవి దేవాలయంలోని పెండింగ్ పనులు ఈనెల 27వ తేదీలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌ఓ విజయలక్ష్మి, ఇరిగేషన్ ఎస్‌ఈ రాంప్రసాద్, ఈఈ కిరణ్‌కుమార్, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ స్వామి, జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాస్‌రావు, గౌతమ్‌రెడ్డి, సత్యపాల్‌రెడ్డి, అజిత్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
వార్డెన్‌పై కలెక్టర్ ఆగ్రహం
వరంగల్ చౌరస్తా: రెసిడెన్షియల్ ఆవరణలో వరదనీరు నిల్వ ఉండటం, అంతర్గత లైటింగ్ లేకపోవడం, మెనూ పాటించకపోవడంతో వార్డెన్‌పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం వరంగల్ యాకుబ్‌పురలోని ప్రభుత్వ కాలేజీ ఆఫ్ ఎక్సలెన్స్ బాలుర ఎస్టీ హాస్టల్‌ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటశాల, స్టోర్ రూం, మరుగుదొడ్లు, వంట సరుకులను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా..అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశిస్తూ ఏమైన సమస్యలు ఉంటే నేరుగా పెట్టెలో వేయాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం నూతనంగా ప్రారంభించిన డార్మెటరీ షెడ్‌ను పరిశీలించారు. కలెక్టర్ వెంట డీటీడీఓ సౌజన్య, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ వీరభద్రం, డీసీఓ సురేందర్, ప్రిన్సిపాల్ హేమంత్, వైస్ ప్రిన్సిపాల్ మధు, ఉపాధ్యాయులు ఉన్నారు.
ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద