
ఓవరాల్ చాంపియన్ ఖమ్మం
అండర్–16 బాలికల విజేత హనుమకొండ
ముగిసిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ అథ్లెటిక్స్ అసోయేషన్ల ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో రెండు రోజుల పాటు నిర్వహించిన 11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు సోమవారం ముగిశాయి. అండర్–14, 16, 18, 20 బాలబాలికల విభాగంలో నిర్వహించిన పోటీల్లో 33 జిల్లాల నుంచి 1,400 మంది అథ్లెట్లు పాల్గొన్నారు.
విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లు..
ఆయా జిల్లాల అథ్లెట్ల మధ్య హోరాహోరీగా సాగిన వివిధ పోటీల్లో ఖమ్మం జిల్లా ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకుంది. అండర్–18 బాలుర కేటగిరీలో మహబూబ్‌నగర్, బాలికల అండర్–18 విభాగంలో ఖమ్మం, అండర్–16 బాలుర విభాగంలో రంగారెడ్డి, అండర్–16 బాలికల విభాగంలో హనుమకొండ జిల్లా విజేతలుగా నిలిచాయి. ముగింపు వేడుకలకు ఆర్యవైశ్య సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు గట్టు మహేశ్‌బాబు ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు చాంపియన్‌షిప్ కోసం పోటీలో పాల్గొన్న ప్రతీ అథ్లెట్ విజేతే అన్నారు. పతకం సాధించలేదని ఆందోళన చెందకుండా, మరోసారి బరిలోకి దిగి లక్ష్యం సాధించాలన్నారు.

ఓవరాల్ చాంపియన్ ఖమ్మం

ఓవరాల్ చాంపియన్ ఖమ్మం

ఓవరాల్ చాంపియన్ ఖమ్మం

ఓవరాల్ చాంపియన్ ఖమ్మం

ఓవరాల్ చాంపియన్ ఖమ్మం