
తెల్లారేసరికి బూడిదే మిగిలింది!
టేకుమట్ల: షార్ట్ సర్క్యూట్‌తో ఓ బట్టల షాపులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో షాపు పూర్తిగా దగ్ధమై తెల్లారేసరికి బూడిదే మిగిలింది. దీంతో చేసేదేమీలేక బాధితులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్లలో చోటుచేసుకుంది. ఈ ఘట నకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భ ద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన శ్రీని వాస్ 2012లో టేకుమట్ల మండల కేంద్రంలో బట్టల షాపును ప్రారంభించి ఇక్కడే స్థిరపడ్డాడు. ఈ క్ర మంలో ఆదివారం అర్ధరాత్రి 11 గంటలకు విద్యుత్ స్తంభంపైకి పాము ఎక్కడంతో షార్ట్ సర్క్యూట్ సంభవించి షాపులో మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన యజమాని శ్రీనివాస్ విద్యుత్ నిలిపి మంటలను ఆర్పే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. దీంతో చేసేదేమీ లేక చుట్టుపక్కల వాళ్లను పిలిచి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. షాపు షెట్టర్ రాకపోవడంతో జే సీబీతో తొలగించారు. అలాగే, వెంటనే ఫైర్ ఇంజన్ కు సమాచారం అందించారు. అగ్నిమాపక అధికా రులు వచ్చేసరికే షాపు మొత్తం కాలి బూడిదైంది.
మిగిలింది బూడిదే..
మండల కేంద్రంలో అర్ధరాత్రి మారుతి బట్టల షాపులో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ఏ ఒక్క వస్తువు మిగులకుండా పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో రూ. 20 లక్షల నగదుతోపాటు షాపులో ఉన్న సుమారు రూ.30 లక్షల విలువైన స్టాక్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. వాటితో పాటు ఫర్నిచర్, కౌంటర్ ఏ ఒక్క వస్తువు కూడా మిగలకుండా కాలి బూడిదైంది. షాపు పైఅంతస్తులో ఉన్న కుటుంబ సభ్యులు ప్రమాద సమయంలో వెంటనే కిందికి రావడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ అగ్ని ప్రమాదంలో బూడిదే మిగిలిందని పొట్ట చేత పట్టుకుని మండల కేంద్రానికి వలస వచ్చిన శ్రీనివాస్‌తోపాటు కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఎమ్మెల్యే గండ్ర పరామర్శ..
షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైన మండల కేంద్రంలోని మారుతి బట్టల షాపును ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సోమవారం పరిశీలించారు. అనంతరం బాధితులను పరామర్శించి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తానన్నారు.
ఎగసిపడిన మంటలతో
ఏం చేయలేకపోయాం..
షార్ట్ సర్క్యూట్ సంభవించిన కొన్ని నిమిషాల్లోనే షాపులో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. మోటారు పైపు సాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. కళ్లముందే ఎగసిపడే మంటల్లో షాపు దగ్ధమవుతుంటే గుండెలు పగిలాయి. ఎంత ప్రయత్నించినా ఏం చేయలేకపోయా. ఫైర్ ఇంజన్ వచ్చేసరికి షాపు పూర్తిగా దగ్ధమైనది. ఇప్పుడు నాకు మిగిలింది బూడిదే.
– శ్రీనివాస్,
మారుతి బట్టల షాపు యజమాని
బట్టల షాపులో అగ్నిప్రమాదం
రూ. 50 లక్షల మేర ఆస్తి నష్టం
అగ్ని ప్రమాదానికి కారణం పాము..
కన్నీరుమున్నీరవుతున్న బాధితులు

తెల్లారేసరికి బూడిదే మిగిలింది!

తెల్లారేసరికి బూడిదే మిగిలింది!