
అకృత్యాలను నివారించాలి
పిల్లలు,
మహిళలపై
విద్యారణ్యపురి: మహిళలు, పిల్లలపై జరుగుతున్న అకృత్యాలను వ్యతిరేకించి, వారికి సురక్షిత వాతావరణం కల్పించాలని హనుమకొండ డీఐఈఓ ఎ.గోపాల్ పిలుపునిచ్చారు. శనివారం హనుమకొండలోని ప్రభుత్వ వృత్తివిద్య జూనియర్ కాలేజీలో జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్), హనుమకొండ భరోసా సెంటర్ సంయుక్తంగా ఆ కళాశాల ప్రి న్సిపల్ శ్రీధర్ అధ్యక్షతన ‘పిల్లలు, మహిళలపై లైంగిక వేధింపులు’ అనే అంశంపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ము ఖ్యఅ తిథిగా హాజరైన డీఐఈవో మాట్లాడుతూ..మహిళలు, పిల్లలపై జరుగుతున్న లైంగిక హింసను అరికట్టాలన్నారు. మహిళలు, బాలికల రక్షణ కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భరోసా సెంటర్ నిర్వహిస్తున్న కౌన్సిలర్ సుమత పేర్కొన్నారు. కార్యక్రమంలో భరోసా సపోర్ట్ పర్సన్ కె.రజిత, కై లాష్, షేర్ ఎన్జీవో ఆర్గనైజేషన్ సభ్యులు ఆర్.జమున, బి.జగ న్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు ఆర్.ప్రవీణ్‌కుమార్, సవ్వాసి శ్రీనివాస్, స్టూడెంట్ కౌన్సిలర్ డి.రవి, కె.రేణుక, విద్యార్థులు పాల్గొన్నారు.
హనుమకొండ డీఐఈఓ ఎ.గోపాల్