
రైల్వేఈసీసీఎస్, షేర్ హోల్డర్ల అభివృద్ధికి కృషి
● రైల్వే ఈసీసీఎస్ ప్రెసిడెంట్ చిలుకు స్వామి
కాజీపేట రూరల్ : దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ జోన్ పరిధిలోని రైల్వే ఎంప్లాయీస్ కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ (ఈసీసీఎస్) లిమిటెడ్‌తో పాటు స భ్యులైన షేర్ హోల్డర్ల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఈసీసీఎస్ ప్రెసిడెంట్ చిలుకు స్వామి అన్నారు. కాజీపేట జంక్షన్‌లో సోమవారం రైల్వే ఈసీసీఎస్ బోర్డు డైరెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో మొత్తం 42 వేల మంది ఈసీసీఎస్ షేర్ హోల్డర్లు ఉన్నారన్నారు. విశాఖ సౌత్‌కోస్ట్ రైల్వే బైపర్‌కేట్‌తో 17వేల మంది డైవర్ట్ అవుతున్నారని,వీరి కోసం విశాఖ కేంద్రంగా ఈసీసీ ఎస్ బ్రాంచ్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. ఈసీసీఎస్‌లో రుణాలు తీసుకుని వివిధ కారణాలతో మృతి చెందిన నలుగురు షేర్ హోల్డర్స్ తీసుకున్న రుణాలు సుమారు రూ.22 లక్షలు మాఫీ చేసి వారి సీఎంటీడీ జమ డబ్బులు రూ.16,52,430ల చెక్కులు అందజేశామన్నారు. స మావేశంలో సికింద్రాబాద్ ఈసీసీఎస్ వైస్ ప్రెసిడెంట్ ఆర్.రామ్మోహన్, సెక్రటరీ సి.చంద్రశేఖరశర్మ, కాజీపేట ఈసీసీఎస్ డైరెక్టర్లు డి.శ్రీనివాస్‌యాదవ్, దేవులపల్లి రాఘవేందర్, కాజీపేట ఈసీసీఎస్ డె లిగేట్స్ బి.శ్రీనివాస్, రాజేందర్, ఇ.రాజు, సునీల్, నాగరాజు, ఎల్.కృష్ణయాదవ్ పాల్గొన్నారు.