
మేడిగడ్డకు వరద ఉధృతి
కాళేశ్వరం: మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తు న్న వర్షాలతో కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ప్రాణహిత వరదతో గోదావరి ఉగ్రరూ పం దాల్చింది. సోమవారం జయశంకర్‌భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో పుష్కరఘాట్లను తాకుతూ దిగువకు తరలుతోంది. దీంతో కాళేశ్వరం వద్ద 10 మీటర్ల ఎత్తులో నీటిమట్టం ప్రవహిస్తోంది. దిగువన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీకి వరదనీరు 5.12 లక్షల క్యూసెక్కులు తరలి రాగా, మొత్తం 85 గేట్లు ఎత్తి అదేస్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు.
జాతీయ విద్యా విధాన ఉత్సవానికి మన్మోహన్‌కు ఆహ్వానం
విద్యారణ్యపురి: న్యూఢిల్లీ లో నేడు( మంగళవారం) జాతీయ విధానం ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవానికి విద్యాశాఖ సమగ్ర శిక్ష హనుమకొండ జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ డాక్టర్ బండారు మన్మోహన్‌కు ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమం జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ)–2020 అమలై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ హాజరుకానున్నారు. కాగా, మన్మోహన్ గతంలో హైదరాబాద్‌లో ఎస్‌ఈఆర్‌టీ ఫ్యాకల్టీగా పనిచేశారు. బోధన, శిక్షణ విద్యాసాంకేతికత అభివృద్ధిలోనూ సేవలందించారు.
అనుమానాస్పద స్థితిలో వాచ్‌మెన్ మృతి
హన్మకొండ అర్బన్ : హంటర్‌రోడ్డులోని వరంగల్ పబ్లిక్ స్కూల్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న పోరిపాక శ్రీనివాస్(54) సోమవారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పాఠశాల ఆవరణలో విగతజీవిగా ఉన్న శ్రీనివాస్‌ను విద్యార్థులు గమనించి యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. దీంతో యాజమాన్యం పోలీసులకు సమాచారం అందజేసింది. అయితే విషయం బహిర్గతం కాకుండా మృతుడి బంధువులతో పాఠశాల యాజ మాన్యం మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతుడు కాజీపేట మండలం భట్టుపల్లి సమీపంలోని కొత్తపల్లి హవేలికి చెందిన వ్యక్తి అని తెలిసింది. శ్రీనివాస్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
3న టీటీసీ థియరీ పరీక్షలు
విద్యారణ్యపురి : జిల్లాలో టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్సు (టీటీసీ) థియరీ పరీక్షలు ఆగస్టు 3వతేదీన నిర్వహించనున్నట్లు హనుమకొండ డీఈఓ డి.వాసంతి సోమవారం తెలిపారు. హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టిసింగ్ ఉన్నత పాఠశాల, లష్కర్‌బజార్‌లోని ప్రభుత్వ బాలికల హైస్కూల్, పెట్రోల్ పంపు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఈ పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు, మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు టీటీసీ పరీక్షలు నిర్వహిస్తారని డీఈఓ వివరించారు. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.తెలంగాణా.గౌట్.ఇన్ వెబ్‌సైట్ నుంచి తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. ఆయా పరీక్ష కేంద్రాలకు అర్ధగంట ముందుగా చేరుకోవాలని డీఈఓ వాసంతి సూచించారు.

మేడిగడ్డకు వరద ఉధృతి

మేడిగడ్డకు వరద ఉధృతి

మేడిగడ్డకు వరద ఉధృతి