
ప్రభుత్వ కళాశాలల్లో ఐఐటీ, నీట్ తరగతులు
విద్యారణ్యపురి: జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూని యర్ కళాశాలల్లో ఐఐటీ, నీట్ తదితర పోటీపరీక్షలకు విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని, అందుకు సంబంధించిన ఫిజిక్స్ వాలా టైంటేబుల్‌ను కచ్చితంగా పాటించాలని వరంగల్ డీఐఈఓ శ్రీధర్ సుమన్ అన్నారు. హనుమకొండలోని డీఐఈఓ కార్యాలయంలో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటర్ సైన్స్ విద్యార్థుల కోసం ఫిజిక్స్ వాలా సౌజన్యంతో ఆన్‌లైన్ ఉచిత శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. స్సైన్స్ అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు ప్రతిరోజూ నిర్ణీత సమయంలో విద్యార్థులకు శిక్షణఇప్పించాలని చెప్పారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు అసైన్‌మెంట్లు, వాటి మూల్యంకనం తదితర అంశాలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.
వరంగల్ డీఐఈఓ శ్రీధర్‌సుమన్