
కన్సాలిడేటెడ్ లెక్చరర్ టర్మినేషన్
● కేయూ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ
● ఆలస్యంగా వెలుగులోకి..
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఖమ్మంలోని వర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో కన్సాల్డిడేటెడ్ లెక్చరర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌రావును టర్మినేషన్ చేస్తూ (ఉద్యోగంలో నుంచి తొలగిస్తూ) రిజిస్ట్రార్ వి.రామచంద్రం జూలై 1న ఉత్తర్వులు జారీ చేయగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీనివాస్‌రావు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలు యూనివర్సిటీ అధికారుల దృష్టికి రాగా.. యూనివర్సిటీ అధికారులు ఈ ఏడాది జనవరిలో విచారణ కమిటీని నియమించారు. కామర్స్‌అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం ప్రొఫెసర్ వరలక్ష్మి చైర్‌పర్సన్‌గా, సభ్యులుగా మ్యాథ్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సౌజన్య, ఇంగ్లిష్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మేఘనరావుతో విచారణ కమిటీని నియమించగా వారు విచారణ జరిపారు. విచారణ జరిపిన ఆ కమిటీ పలు ఆధారాలతో కూడిన నివేదికను యూనివర్సిటీ అధికారులకు అందజేసింది. శ్రీనివాస్‌రావుపై చర్యలు తీసుకోవాలని ఆ నివేదికలో పేర్కొన్నారని సమాచారం. అనంతరం రిజిస్ట్రార్ వి.రామచంద్రం కన్సాలిడేటెడ్ లెక్చరర్ శ్రీనివాస్‌రావుకు షోకాజ్ నోటీస్ జారీచేశారు. ఆ నోటీస్‌కు ఆయన వివరణ కూడా ఇచ్చారు. చివరికి శ్రీనివాస్‌రావును విధులనుంచి టర్మినేషన్ చేస్తూ రిజిస్ట్రార్ రామచంద్రం ఈ నెల 1న ఉత్తర్వులు జారీచేశారు. విచారణ కమిటీ నివేదిక ఆధారంగా శ్రీనివాస్‌రావును టర్మినేషన్ చేసినట్లు రిజిస్ట్రార్ శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు.