
సత్ఫలితాలు సాధించాలంటే సమష్టి కృషి అవసరం
న్యూశాయంపేట: నిరుపేద మైనార్టీ విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం సత్ఫలితాలు సాధించాలంటే సమష్టి కృషి అవసరమని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ (టెమ్రిస్) డిప్యూటీ సెక్రటరీ జుబేదా అన్నారు. శుక్రవారం హనుమకొండ, పెద్దమ్మగడ్డ వద్ద ఉన్న మైనార్టీ బాలుర గురుకులంలో టెమ్రిస్ సెక్రటరీ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా పరిధి మైనార్టీ గురుకులాల ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమీక్షలో పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా జుబేదా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల విద్యాభివృద్ధి, సాధికారత కోసం కృషి చేస్తోందని వాటిని నిరుపేద విద్యార్థులకు అందేలా పనిచేయాలన్నారు. సమీక్షలో అకడమిక్స్, హాస్టళ్ల మేనేజ్‌మెంట్, శానిటేషన్ తదితర 20 అంశాలను చర్చించారు. వాటికి సలహాలు అడిగి పలు సూచనలిచ్చారు. సమీక్షలో ఉమ్మడి జిల్లా రీజినల్ కో–ఆర్డినేటర్ డాక్టర్ జంగా సతీశ్, విజిలెన్స్ అధికారులు సయ్యద్ అక్బర్, పాషా, ప్రిన్సిపాళ్లు జి.భిక్షపతి, టి.శ్రీనివాస్, నీరజ, నీలిమాదేవి, శ్రీపాల, క్రిష్ణకుమారి, రాజు, పి.అనిల్‌బాబు, కుమార్ అకడమిక్ కో–ఆర్డినేటర్ రుహీనా తదితరులు పాల్గొన్నారు.
టెమ్రిస్ డిప్యూటీ సెక్రటరీ జుబేదా
ఉమ్మడి జిల్లాలోని గురుకులాల ప్రిన్సిపాళ్లతో సమీక్ష