
పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హన్మకొండ: పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, సీఎం సహాయ నిధి చెక్కులు అందించారు. 52 మందికి రూ.19.79 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులు, 202 మందికి రూ.2,22,02,432ల విలువైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే నాయిని అందించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తేనే నిజమైన ఇందిరమ్మ రాజ్యం సాధ్యమవుతుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో మహిళలకు అగ్రభాగం కల్పిస్తున్నారన్నారు. కార్యక్రమంలో అధికారులు, కార్పొరేటర్లు, లబ్ధిదారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.