
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో గ్రేటర్ వరంగల్ ర్యాంక్
శాసీ్త్రయ విధానాల్ని అమలు చేస్తాం..
నగరంలో స్వచ్ఛ సర్వేక్షణ్ కోసం శాసీ్త్రయ విధానాల్ని అమలు చేస్తాం. మెరుగైన ర్యాంకు సాధిస్తాం. 2019 నుంచి వరంగల్ నగరానికి ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ++ వరుసగా స్థానం లభిస్తోంది. 3లక్షల నుంచి 10 లక్షల జనాభాలో జాతీయ స్థాయిలో 22వ స్థానం, రాష్ట్ర స్థాయిలో 4వ స్థానం లభించడంపై హర్షం వ్యక్తం చేశారు.
– గుండు సుధారాణి, నగర మేయర్
●
వరంగల్ అర్బన్: స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో వరంగల్ నగరం పడిలేస్తోంది. గతేడాది పోలిస్తే ఈఏడాది కొంత మెరుగైన ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ అమలులో పాలక, అధికార వర్గాలు ఆశించిన స్థాయిలో ర్యాంకు సాధించలేకపోయాయి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ 2024–25 ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌పై జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించింది. ఢిల్లీలో గురువారం అధికారులు పోటీల వివరాల్ని అధికారికంగా వెల్లడించారు. మూడు కేటగిరీల్లో నిర్వహించిన పోటీల్లో గ్రేటర్ వరంగల్ నిరాశపర్చింది. జాతీయ స్థాయిలో నగరాలు, పట్టణాల్లో నిర్వహించిన పోటీల్లో 84వ ర్యాంకు సాధించింది. ఇక 3 లక్షల జనాభా 10 లక్షల కేటగిరీలో 22వ ర్యాంక్, తెలంగాణ వ్యాప్తంగా పోటీల్లో 4వ స్థానాన్ని కై వసం చేసుకుంది. దేశవ్యాప్తంగా ఈపోటీల్లో ఇండోర్ మరోమారు మొదటిస్థానంలో నిలిచి సుస్థిర స్థానాన్ని భద్రపర్చుకుంది. గ్రేటర్ హైదరాబాద్‌కు 26వ స్థానం, సిద్దిపేటకు 30వ ర్యాంక్ లభించింది. దేశంలోనే మొదటిసారిగా 2012 అక్టోబర్‌లో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ అమలుకు శ్రీకారం చుట్టి శానిటేషన్ నిర్వహణలో బెస్ట్ సిటీగా అనేక అవార్డులు రివార్డులు, ప్రశంసపత్రాలు అందుకుని, రోల్ మోడల్‌గా నగరం నిలిచినప్పటికీ.. పోటీల్లో ఢీలా పడుతోంది.
అక్కడే దెబ్బ పడిందా?
స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో భాగంగా.. 7,500 మార్కులకుగాను వరంగల్ నగరం 4,677 మార్కులు సాధించింది. చెత్త రహిత నగరం (జీఎఫ్‌సీలో గ్రేటర్ వరంగల్ తీవ్ర నిరాశకు గురి చేసింది. 1,250 మార్కులకుగాను ‘0’ మార్కులు వచ్చాయి. భూగర్భ డ్రెయినేజీ, సీవరేజ్ ప్లాంట్ లేకపోవడమే ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. సర్వీస్ లెవల్ ప్రోగ్రెస్ (ఎస్‌ఎల్పీ)లో 3,000లకుగాను 2,145 మార్కులు వచ్చాయి. పారిశుద్ధ్య నిర్వహణలో కొంత ఫర్వాలేదు అనిపించింది. బహిరంగ మల, మూత్ర విసర్జన (ఓడీఎఫ్)లో 1,000 మార్కులకు 600 మార్కులు మాత్రమే వచ్చాయి. మానవ వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్లు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం, ఆధునిక విధానాల్ని అవలంభించకపోవడం వల్ల మార్కులు తగ్గుముఖం పట్టాయి. సిటిజన్ వాయిస్‌లో 2,250 మార్కులకు 1,932 వచ్చాయి. పౌరుల్ని చైతన్యం చేసి, అభిప్రాయ సేకరణలో మాత్రం సక్సెస్ అయ్యారు.
ఇదీ వరుస..
3 లక్షల నుంచి 10 లక్షల జనాభా కేటగిరీలో 22వ స్థానం తెలంగాణలో 4వ స్థానం నిరాశపర్చిన స్వచ్ఛత విధానాలు!
ఎంఓహెచ్‌యూఏలో నంబర్ వన్
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మరో కీలక విజయాన్ని సాధించింది. గార్బేజ్ ఫ్రీ సిటీ (జీఎఫ్‌సీ) గుర్తింపులో భాగంగా.. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ (ఎంఓహెచ్‌యూఏ) నుంచి మొట్ట మొదటిగా 1–స్టార్ రేటింగ్ పొందింది.
సంవత్సరం నగరాలు/ స్వచ్ఛ సర్వేక్షణ్
పట్టణాలు ర్యాంకింగ్
2014–15 75 33
201–16 100 32
2016–17 500 28
2017–18 4,041 31
2018–19 4,237 81
2019–20 4,242 144
2020–21 4,320 115
2021–22 4,354 64
2022–24 4,354 65
2024–25 4,354 101
2025–26 4,677 84

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో గ్రేటర్ వరంగల్ ర్యాంక్