కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు ఉద్వాసన! | - | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు ఉద్వాసన!

Jul 18 2025 4:46 AM | Updated on Jul 18 2025 4:46 AM

కాంట్

కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు ఉద్వాసన!

కేయూ క్యాంపస్‌: కేయూ విద్యా కళాశాల కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ రణధీర్‌రెడ్డి ఈసంవత్సరం విధులు నిర్వర్తించేందుకు వర్సిటీ అధికారులు ‘కాంట్రాక్టు’ను రెన్యూవల్‌ చేయలేదు. విద్యాకళాశాలలో గతంలో రణధీర్‌రెడ్డి ప్రిన్సిపాల్‌గా, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆసమయంలో అవకతవకలకు పాల్పడినట్లు వెల్లడైంది. కళాశాలలోని బీఓఎస్‌ అకౌంట్‌లోని రూ.8.50 లక్షలు రణధీర్‌రెడ్డి వినియోగించుకుని, ఆతర్వాత నిధుల్ని తిరిగి రిజిస్ట్రార్‌ ఫండ్‌ అకౌంట్‌లోకి జమ చేసిన విషయం తెలిసిందే. ఈవ్యవహారంపై ‘నిధులు హాంఫట్‌’ శీర్షికన అప్పట్లోనే ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. అవకతవకల వ్యవహారంపై ప్రొఫెసర్లతో కూడిన రెండు వేర్వేరు కమిటీలను కూడా వేశారు. ఆ కమిటీలు విచారణ జరిపి రిపోర్టులు అందించినా వర్సిటీ అధికారులు చర్యలు తీసుకోలేదు. ఆయన సైతం కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా కొనసాగుతూ వస్తున్నారు. కాగా.. గురువారం విద్యాకళాశాలలో రిజి స్ట్రార్‌ రామచంద్రం అధ్యాపకుల సమావేశం నిర్వహించారు. ఈసమావేశానికి రణధీర్‌రెడ్డి హాజరయ్యారు. సమావేశం అనంతరం రిజి స్ట్రార్‌ సమక్షంలో ఆవిద్యాకళాశాల ప్రిన్సిపాల్‌ మనోహర్‌ మాట్లాడుతూ ‘మీ కాంట్రాక్టును వ ర్సిటీ అధికారులు రెన్యూవల్‌ చేయలేదని, ఇక నుంచి విధులకు రావొద్దని రణధీర్‌రెడ్డికి తెలి పారు. ఈవిషయంపై రిజిస్ట్రార్‌ రామచంద్రంను ‘సాక్షి’ వివరణ కోరగా.. నిధులు వినియోగించుకుని మళ్లీ తిరిగి చెల్లించారని వెల్ల డైనందున అతడి కాంట్రాక్టును ఈవిద్యాసంవత్సరానికి రెన్యూవల్‌ చేయలేదని వివరణ ఇచ్చారు.

రెన్యువల్‌ కాని ‘కాంట్రాక్టు’

రణధీర్‌రెడ్డిని విధులకు రావొద్దన్న ప్రిన్సిపాల్‌ మనోహర్‌

కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు ఉద్వాసన!1
1/1

కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు ఉద్వాసన!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement