
నగరంలో రూట్లు, స్టేజీలు ఇలా..
హన్మకొండ చౌరస్తా: హనుమకొండ చౌరస్తా సమీపంలోని ఏనుగులగడ్డ వద్ద ఎండలో రోడ్డుపైనే నిల్చున్న వీరంతా ఆర్టీసీ బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. భూపాలపల్లి, ఏటూరునాగారం, నర్సంపేట మీదుగా వివిధ ప్రాంతాలకు నిత్యం వందల సంఖ్యలో ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర సాధారణ ప్రజలు వెళ్తుంటారు. ఏనుగులగడ్డలో సుమారు 17 ఏళ్ల క్రితం వరకు ఇక్కడ బస్‌షెల్టర్ ఉండేది. అభివృద్ధి పనుల్లో భాగంగా షెల్టర్‌ను తొలగించిన అధికారులు ఆ తర్వాత నిర్మించడం మర్చిపోయారు. నడిరోడ్డుపైనే బస్సులను నిలపడం వల్ల ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయని గ్రహించి పదేళ్ల క్రితం పక్కనే బస్‌బేను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రయాణికులు ఎండకు, వర్షానికి ఇబ్బందులు ఎదుర్కోవడం సాధారణంగా మారింది.
అధికారులు చొరవ తీసుకోవాలి..
హనుమకొండ నుంచి ఏ ఊరికి వెళ్లాలన్నా ఏనుగులగడ్డ వద్దనే బస్సు ఎక్కాలి. 20 ఏళ్ల క్రితం బస్‌షెల్ట ర్‌ను తొలగించిన అధికారులు తిరిగి నిర్మించలేదు. ఎందుకు నిర్మించడం లేదని చాలాసార్లు అధికారులను ఆరా తీశాం. ఏదో స్థల వివాదం ఉందని దాటవేస్తూ వస్తున్నారు. ఇప్పటికై నా మున్సిపల్, ఆర్టీసీ అధికారులు చొరవ తీసుకుని బస్‌షెల్టర్‌ను నిర్మించాలి.
– గూడూరు వేణుప్రసాద్, సుధానగర్
u
వరంగల్ నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. శరవేగంగా జనాభా పెరుగుతోంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తమ పిల్లల చదువులకు, ఇతరత్రా వ్యాపారాల కోసం నగరానికి వచ్చేస్తున్నారు. దీనికితోడు రోజూ వివిధ పనుల నిమిత్తం వచ్చిపోయే వారు అనేకం. ఇక్కడ విద్యాసంస్థలు కూడా ఎక్కువే. స్థానికంగా వరంగల్, హనుమకొండ, కాజీపేటకు వెళ్లేవారు ఎక్కువగా సిటీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. మహాలక్ష్మి పథకం నేపథ్యంలో మహిళలు దాదాపుగా బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. విద్యార్థులు సైతం బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. నగరంలోని ప్రధాన సెంటర్ల వద్ద బస్‌షెల్టర్లు లేక ప్రయాణికులు ఎండలోనే నిలబడాల్సి వస్తోంది. కొన్నిచోట్ల ఉన్నప్పటికీ చిరు వ్యాపారులు, ఇతరులు ఆక్రమించడం, అపరిశుభ్రంగా ఉండడంతో ప్రయాణికులు నిల్చోలేని పరిస్థితి. దీంతో కూడళ్ల సమీపంలోని దుకాణాల వద్ద, కొన్నిచోట్ల చెట్లనీడన వేచి చూస్తున్నారు. అసలే ఎండలు మండిపోతుండడంతో వారి అవస్థలు అన్నీఇన్నీ కావు. ఈనేపథ్యంలో నగరంలోని ప్రధాన సెంటర్ల వద్ద బస్‌షెల్టర్లు లేక ప్రయాణికులు పడుతున్న అవస్థలపై ‘సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. – సాక్షి నెట్‌వర్క్
రూట్‌లు : 04 మొత్తం స్టేజీలు 96
ప్రధాన స్టేజీలు 32 రిక్వెస్ట్ స్టేజీలు 64
కాజీపేట రూరల్: కాజీపేట బాపూజీనగర్‌లో హైదరాబాద్–వరంగల్ హైవే రోడ్డుపై బస్ షెల్టర్లు లేక ఆర్టీసీ బస్సుల కోసం వేచి చూసే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. బాపూజీనగర్ గాంధీ బొమ్మ వద్ద బస్టాప్ ఉంది కానీ షెల్టర్ లేదు. బాపూజీనగర్ చుట్టు పక్కల ప్రాంతాలవారు, విద్యార్థులు, వివిధ పనులకు వెళ్లే వారు ఇక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో వెళ్తుంటారు. హనుమకొండ మార్గంలో సైతం షెల్టర్ లేదు. ప్రయాణికులు రోడ్డుపై ఎండలో, వానలో, ప్రభుత్వ పాఠశాల, దుకాణాల ఎదుట వేచి ఉండాల్సి వస్తోంది. ఇక్కడ బస్టాప్ ఉన్నప్పటికీ అప్పుడప్పుడు బస్‌లు కూడా ఆపడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
ఇబ్బంది పడుతున్నాం..
నేను రాంపూర్ ఇండస్ట్రియల్‌లో పని చేస్తున్నా. రోజూ బస్సులోనే వెళ్లి వస్తా. బాపూజీనగర్‌లో బస్‌షెల్టర్ లేక ఎండకు, వానకు ఇబ్బంది పడుతున్నాం. అప్పుడప్పుడు ఇక్కడ బస్సులు ఆపడం లేదు. దీంతో డీజిల్‌కాలనీ వరకు వెళ్లి అక్కడ ఎక్కుతున్నాం. అధికారులు స్పందించి షెల్టర్ నిర్మించడంతోపాటు బస్సులు ఆపాలి. – నిర్మల, బాపూజీనగర్
నగరంలో బస్‌షెల్టర్లు లేక ప్రయాణికుల అవస్థలు
గ్రేటర్ పరిధిలో మొత్తం బస్‌స్టేజీలు 92 మండుతున్న ఎండలు.. రోడ్లపైనే ఎదురుచూపులు
సమీప దుకాణాలు, చెట్ల నీడే దిక్కు.. కొన్నిచోట్ల షెల్టర్లు ఉన్నా.. అనువుగా లేక కూర్చోలేని దుస్థితి పట్టించుకోని అధికారులు
షెల్టర్ల నిర్మాణంలో విఫలం
హన్మకొండ : వరంగల్ నగరం స్మార్ట్‌సిటీగా ఎంపికై న తర్వాత గతంలో ఉన్న బస్ షెల్టర్లను రోడ్డు వెడల్పు, డ్రెయినేజీ నిర్మాణంలో భాగంగా తొలగించారు. బస్ బేలు, బస్ షెల్టర్లు నిర్మించాల్సి ఉండగా పూర్తి స్థాయిలో బస్ షెల్టర్ల నిర్మాణంలో అధికార యంత్రాగం విఫలమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
హైవేపై నిలబడి..
మడికొండలో..
న్యూశాయంపేట చౌరస్తాలో..
ఎండలో మాడుతున్నారు..

నగరంలో రూట్లు, స్టేజీలు ఇలా..

నగరంలో రూట్లు, స్టేజీలు ఇలా..

నగరంలో రూట్లు, స్టేజీలు ఇలా..

నగరంలో రూట్లు, స్టేజీలు ఇలా..

నగరంలో రూట్లు, స్టేజీలు ఇలా..