
మామునూరు విమానాశ్రయంపై సర్కారు నజర్
● తాజాగా 253 ఎకరాల కోసం
రూ.205 కోట్లకు పాలనాపరమైన అనుమతులు
● విమానాశ్రయానికి 50 శాతం మందికిపైగా
రైతులు అంగీకారం
● మరో రూ.112 కోట్లు అత్యవసరం
సీఎం రేవంత్‌రెడ్డికి ఽకృతజ్ఞతలు
మామునూరు ఎయిర్ పోర్ట్ నిర్మాణంతో వరంగల్‌కు మహర్దశ పట్టనుంది. భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.205 కోట్లు నిధులు విడుదల చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.1.20 కోట్లు పరిహారం ఇవ్వనుంది. ఖాళీ ప్లాట్లు, ఇళ్లకు సైతం న్యాయమైన పరిహారం చెల్లిస్తుంది. నెల రోజులుగా భూ సేకరణ ప్రక్రియను వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఎంతో కృషి చేశారు.
– మంత్రి కొండా సురేఖ