
వరలక్ష్మీ.. నమోస్తుతే!
శ్రావణమాసం మొదటి శుక్రవారం సందర్భంగా వరంగల్ ఎంజీఎం ఎదురుగా ఉన్న రాజరాజేశ్వరీ దేవాలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. అర్చకులు యెల్లంభట్ల లక్ష్మణశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం దేవాలయంలోని హాల్‌లో వరలక్ష్మీ అమ్మవారి ప్రతిమను ప్రతిష్ఠించి సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. మహిళలు పెద్దఎత్తున పాల్గొని వ్రతాన్ని ఆచరించారు. ఆలయ చైర్మన్ వద్దిరాజు వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు. అదేవిధంగా వరంగల్ హంటర్‌రోడ్డులోని సంతోషిమాత దేవాలయంలో అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.
– హన్మకొండ కల్చరల్