
రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్న మోదీ
హన్మకొండ చౌరస్తా: భారత రాజ్యాంగాన్ని మోదీ సర్కారు అవహేళన చేస్తోందని కాంగ్రెస్ హనుమకొండ జిల్లా కమిటీ అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. హనుమకొండలోని డీసీసీ భవన్‌లో ఆదివారం వరంగల్, హనుమకొండ జిల్లాల పార్టీ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జైబాపు, జైభీమ్, జై సంవిధాన్ నినాదంతో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తోందని పేర్కొన్నారు. సమావేశానికి వరంగల్, హనుమకొండ జిల్లాల ఇన్‌చార్జ్‌లుగా జ్ఞానేశ్వర్ ముదిరాజ్, రాయల నాగేశ్వర్‌రావు నియమితులైనట్లు వెల్లడించారు. అనంతరం బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ విధానాలపై ఏర్పాటు చేసిన ప్రాజెక్టు వీడియోను ప్రదర్శించారు. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, టీపీసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాలతో నిర్వహించిన సమావేశంలో వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, మేయర్ సుధారాణి పాల్గొన్నారు.
హన్మకొండ: జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. నాయిని విశాల్‌రెడ్డి ట్రస్టు ఆధ్వర్యాన ఫాక్స్‌కాన్ సంస్థ నేతృత్వంలో హనుమకొండ నయీంనగర్‌లోని వాగ్దేవి డిగ్రీ, పీజీ కళాశాలలో ఆదివారం మహిళల మెగా జాబ్ మేలా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో పెద్దపీట వేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తరువాత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నిరంతరం కొనసాగుతోందని, కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నదని తెలిపారు. రానున్న రోజుల్లో ఐటీ, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఉపాధి అవకాశాల కల్పనపై దృష్టి సారించి ప్రముఖ కంపెనీలతో జాబ్ మేలా నిర్వహిస్తామన్నారు. ఫాక్స్‌కాని సంస్థ ప్రతినిధి ఆనంద్‌కుమార్, పరమేష్, పార్వతి వాగ్దేవి కళాశాల కరస్పాండెంట్ దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.
పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి