వరంగల్ నగరంలో గురువారం మధ్యాహ్నం అరగంటపాటు కురిసిన వర్షానికే ప్రజా రవాణా ఆగమాగమైంది. హనుమకొండలోని ప్రభుత్వ కాకతీయ డిగ్రీ కళాశాల, అంబేడ్కర్ భవన్, అశోక్‌నగర్, ఎన్జీఓస్ కాలనీల రోడ్లలో మోకాలు లోతు వరకు వరద చేరుకుంది. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనాలు మధ్యలోనే ఆగిపోయాయి. అస్తవ్యస్తమైన నాలా వ్యవస్థ వల్లే డ్రెయినేజీలు నిండి నీరు రోడ్లపైకి చేరుతుందని నగరవాసులు వాపోతున్నారు.
– సాక్షి స్టాఫ్‌ఫొటోగ్రాఫర్, హనుమకొండ