
చట్టాలను కాలరాస్తున్న ప్రభుత్వాలు
హన్మకొండ: కార్మిక చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని.. బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో కార్మిక సంక్షేమ మాసోత్సవంలో భాగంగా శుక్రవారం వివిధ కార్మిక సంఘాల నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు కోడ్‌లను ఉపసంహరించుకోవాలని డిమా ండ్ చేశారు. రౌండ్ టేబుల్ సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలు అమలు చేయాలని కోరుతూ.. 27వ తేదీన హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేయనున్నట్లు తెలిపారు. 30న ఆటో కార్మికులచే ధర్నా నిర్వహించనున్నట్లు, 31న కార్మిక మాసోత్సవాల ముగింపు నిర్వహించనున్నట్లు వివరించారు. కార్మికులకు అండగా బీఆర్‌ఎస్ నిలుస్తుందన్నారు. సమావేశంలో కార్మిక నాయకులు నాయిని రవి, ఇంజాల మల్లేశం, ఈసంపల్లి సంజీవ, మహమూద్, ఇస్మాయిల్, తేలు సారంగపాణి, జి.నరహరి, రవీందర్‌రెడ్డి రఘుపతి రెడ్డి, రఘు, శివకుమార్, రాజారపు రాజు, శ్రీధర్‌రెడ్డి, వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు,
మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్