
నేడు మార్కెట్‌లోకి విజయ డెయిరీ కొత్త ప్యాకింగ్
హన్మకొండ చౌరస్తా: తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ పాలు, పెరుగు ఉత్పత్తులను నేటి (శనివారం) నుంచి కొత్త ప్యాకింగ్‌లో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వరంగల్ యూనిట్ డీడీ శ్రవణ్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలి పారు. నూతనంగా ప్యాకింగ్ ఉత్పత్తులను ములుగురోడ్ సమీపంలోని విజయ డెయిరీ ఆవరణలో ఉదయం 11గంటలకు డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి, వరంగల్ ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి చేతుల మీదుగా మార్కెట్‌లో కి విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. 150 ఎంఎల్ టోన్డ్ మిల్క్, 120, 400 టీఎం పెరుగు ప్యాకెట్లతోపాటు 900 గ్రాములు, 1 కేజీ, 5కేజీ, 10 కేజీ డీటీఎం పెరుగు బకెట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వివరించారు.
ఎంబీఏ పరీక్షల పరిశీలన
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎంబీఏ నాలుగో సెమిస్టర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం క్యాంపస్‌లోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం పరీక్ష కేంద్రాన్ని రిజిస్ట్రార్ వి.రామచంద్రం సందర్శించారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. ఆయన వెంట కళాశాల ప్రిన్సిపాల్ పి.అమరవేణి, డాక్టర్ ప్రగతి ఉన్నారు.
బాలికను దత్తత తీసుకున్న
అమెరికా దంపతులు
హన్మకొండ అర్బన్: జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అనుబంధ శిశు గృహ, బాల సదనంలో ఆశ్రయం పొందుతున్న పదేళ్ల బాలికను అమెరికా దేశానికి చెందిన దంపతులకు ఇంటర్ కంట్రీ అడాప్షన్ ఇచ్చినట్లు జిల్లా సంక్షేమాధికారి జయంతి తెలిపారు. గతంలోనే ఈ దంపతులు అంతర్రాష్ట్ర దత్తత కోసం దరఖాస్తు చేసుకున్నట్లు.. పరిశీలించిన కేంద్ర దత్తత వనరుల విభాగం వారికి సీనియార్టీ ప్రకారం నిబంధనల మేరకు కలెక్టర్ ఆధ్వర్యంలో బాలికను దత్తత అందించినట్లు తెలిపారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మాతృత్వం ఒక వరమని అందుకు చట్టబద్ధమైన దత్తత ప్రధాన మార్గమన్నారు. కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు సందసాని రాజేంద్రప్రసాద్, బాలరక్షా భవన్ కో–ఆర్డినేటర్ సీహెచ్.అవంతి, సూపరింటెండెంట్ కళ్యాణి, జిల్లా బాలల పరిరక్షణ ఇన్‌చార్జ్ అధికారి ప్రవీణ్‌కుమార్, ప్రొటెక్షన్ ఆఫీసర్ మౌనిక, దత్తత కేంద్రం సోషల్ వర్కర్ సంగి చైతన్య, తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న
ఇంటర్ పరీక్షలు..
విద్యారణ్యపురి: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగుతున్నాయి. హనుమకొండ జిల్లాలో ఉదయం నిర్వహించిన ఇంటర్ ప్రథమ ఫస్టియర్ పరీక్షలకు 2,127 మంది విద్యార్థులకుగాను 1,851మంది (87శాతం)హాజరుకాగా.. 276 మంది గైర్హాజరయ్యారని డీఐఈఓ గోపాల్ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన సెకండియర్ పరీక్షలకు 152 మందికిగాను 75 మంది హాజరుకాగా, 77 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.
వరంగల్ జిల్లాలో 91మంది గైర్హాజరు..
వరంగల్ జిల్లాలో ఇంటర్ ఫస్టియర్‌లో 559 మందికి 499 మంది హాజరుకాగా, 60 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. సెకండియర్ పరీక్షల్లో 131 మందికి గాను 110 మంది హాజరుకాగా, 31 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.