కాళోజీ సెంటర్ : ములుగు రోడ్డు సమీపంలోని ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్‌లో ఉన్న వరంగల్ జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 22న ఉద్యోగ మేళా నిర్వహిస్తునట్లు జిల్లా ఉపాధి అధికారి ఎన్.మాధవి ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండలోని ఫ్లిప్ కార్ట్ కంపెనీలో పనిచేసేందుకు 30 మందిని ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు పదో తరగతి చదివి, 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయస్సు ఉండాలని తెలిపారు. ఎంపికైన వారి కి రూ. 18,000 నుంచి రూ.20,000 వేతనం ఇస్తారని పేర్కొన్నారు. వివరాలకు 7799314685 నంబ ర్‌లో సంప్రదించవచ్చునని ఆమె సూచించారు.