
సెల్ఫీ విత్ గణేశ్
మీరు పర్యావరణ పరిరక్షణలో భాగమై మట్టి
గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారా..జిల్లాలోని
అపార్ట్‌మెంట్, కమ్యూనిటీ, లేదా ఇళ్లలో ప్రత్యేక ఆకృతుల్లో ఏర్పాటు చేశారా అయితే మీ విగ్రహ ప్రత్యేకతలను ‘సాక్షి’తో పంచుకోండి. మట్టి,
ప్రత్యేక ఆకృతుల విగ్రహాలతో సెల్ఫీ తీసి
వాట్సాప్ చేయండి. మీ పేరు, చిరునామాను స్పష్టంగా పంపించండి. ఎంపిక చేసిన
ఫొటోలను ప్రచురిస్తాం.
వాట్సాప్ చేయాల్సిన నంబర్ : 94947 29272
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు
సల్మాన్ ఖుర్షీద్
హన్మకొండ: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీ స్కీమ్‌లు అమలు చేస్తామని ఆ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యుడు సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. సోమవారం హనుమకొండలో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సంకల్ప యాత్ర చేపట్టారు. రాంనగర్‌లోని బంజార తండాలో ప్రారంభమైన యాత్ర, గోకుల్‌నగర్, వెంకట్రామ్ నగర్, గాంధీనగర్, మీదుగా వాజ్‌పేయి కాలనీ వరకు సాగింది. ఇంటింటికి వెళ్లి ఆరు గ్యారంటీ పథకాలను వివరిస్తూ, కరపత్రాలు పంచారు. వాజ్‌పేయ్ కాలనీలోని స్థానికులతో కలిసి నాయకులు సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా 50 మంది యువకులు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ కరీంనగర్ బహిరంగ సభలో సోనియా ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సోనియా ప్రకటించిన గ్యారంటీ స్కీమ్‌లు మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం, చేయూత కార్యక్రమాలు ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, ఏఐసీసీ అబ్జర్వర్, వరంగల్ పార్లమెంట్ ఇన్‌చార్జ్ రవీంద్ర ఉత్తమ్‌రావు దళ్వీ, పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు లక్కి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి, టీపీసీసీ ప్రచార కమిటీ కన్వినర్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్‌కు వీఆర్‌ఎస్ ఇవ్వండి
హసన్‌పర్తి:బీఆర్‌ఎస్ పార్టీకి వీఆర్‌ఎస్ ఇవ్వాలని కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జ్, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి పిలుపునిచ్చారు. ఆరు గ్యారంటీ పథకాలపై సోమవారం హసన్‌పర్తిలో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాల ద్వారా ప్రచారం చేపట్టారు. అనంతరం కార్యకర్తలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కాంగ్రెస్ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ నమిండ్ల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, పీసీసీ సభ్యుడు వరద రాజేశ్వర్‌రావు, కాంగ్రెస్ నాయకులు కేఆర్.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి
తీసుకెళ్లండి : సల్మాన్ ఖుర్షీద్
వరంగల్: తెలంగాణ తల్లి సోనియా ప్రకటించిన ఆరు గ్యారంటీ హామీలను ప్రజలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సీడబ్ల్యూసీ మెంబర్ సల్మాన్ ఖుర్షీద్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మాజీ మంత్రి కొండా సురేఖతో కలిసి ఈ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. తెలంగాణ ప్రగతి కోసం ప్రజల భవిత కోసం కాంగ్రెస్ ఇచ్చే హామీలతో కూడిన అభయ హస్తం గ్యారంటీ కార్డు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు 72868 55555 నంబర్‌కు మిస్డ్‌డ్ కాల్ ఇవ్వాలని కోరారు.

హనుమకొండలో చిన్నారితో ముచ్చటిస్తున్న సల్మాన్ ఖుర్షీద్

వరంగల్‌లో గ్యారంటీ కార్డు పంపిణీలో సల్మాన్ ఖుర్షీద్, మాజీ మంత్రి కొండా సురేఖ