
జెండాకు వందనం చేస్తున్న గోపాల్ రావు
హన్మకొండ: స్వరాష్ట్రంగా సిద్ధించినప్పటి నుంచి తెలంగాణ.. ప్రగతి సూచికల్లో అగ్రగామి రాష్ట్రంగా కొనసాగుతోందని టీఎస్ ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు అన్నారు. సమైక్యతా దినోవత్సవం సందర్భంగా ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని ప్రధాన కార్యాలయంలో జాతీయ పతాకా న్ని ఆవిష్కరించారు. అంతకు ముందు విద్యుత్ అమర వీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్.. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అన్ని వర్గాలకు అందజేస్తున్నారన్నారు. సమైక్యతతోనే ఆర్థిక ప్రగతి, సంక్షేమమని, విద్యుత్ రంగంలో ఎన్నో మైలురాళ్లు అధిగమించామన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు నేతృత్వంలో ప్రజలకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామన్నారు. డైరెక్టర్లు బి.వెంకటేశ్వర రావు, పి.గణపతి, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బి.జనార్దన్, సీజీఎంలు బి.అశోక్ కుమార్, టి.సదర్ లాల్, వి.మోహన్ రావు, కె.కిషన్, ప్రభాకర్, రవీంద్రనాథ్, జాయింట్ సెక్రటరీ కె.రమేష్, కంపెనీ కార్యదర్శి కె.వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
టీఎస్ ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు