
విమోచన దినోత్సవ వేడుకల్లో నాయకులు
హన్మకొండ: ప్రపంచ మొదటి కార్మికుడు విశ్వకర్మ జయంతిని జాతీయ కార్మిక దినోత్సవంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శశికుమా ర్ అన్నారు. ఆదివారం హనుమకొండ అడ్వకేట్స్ కాలనీలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినం, విశ్వకర్మ జయంతి కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈ ప్రాంత ప్రజ లు పోరాటం చేస్తున్న క్రమంలో అప్పటి దేశ హోంశాఖ మంత్రి వల్లభాయి పటేల్, భారత సైన్యంతో ఒత్తిడి తీసుకురావడంతో లొంగిపోయారని, దీంతో అప్పటి వరకు నిజాం పాలనలో ఉన్న తెలంగాణ భారత్‌లో కలిసిందన్నారు. యూనియర్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రావుల రమణారెడ్డి మాట్లాడు తూ అపరిష్కృతంగా ఉన్న విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని యాజమాన్యాన్ని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి దారావత్ లక్ష్మ ణ్‌నాయక్, బీఎంఎస్ జిల్లా కన్వీనర్ గాదె మహేంద ర్, నాయకులు గంజి శ్రీనివాస్, సత్యనారాయణరెడ్డి, దాస్యం వేణుమాధవ్, సంగీత్‌కుమార్, గోలి అనిల్ రెడ్డి, వేణు, కె.యుగేందర్, కడెం మహేష్, గాజుల సంపత్ కుమార్, పుల్లాజీ, శ్రీనివాస్, రాజకుమార్, పిల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో..
కాజీపేట అర్బన్: హనుమకొండ కలెక్టరేట్‌లోని బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో ఆదివారం బీసీ వెల్ఫేర్ డీడీ రాంరెడ్డి ఆధ్వర్యాన విరాట్ విశ్వకర్మ యజ్ఞమహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతిప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణుల సంఘం నాయకులు అలుగోజు కృష్ణమూర్తి, శ్రీరామోజు సోమేశ్వరరావు, విష్ణువర్ధన్, భరత్, సురేందర్, బీసీ వెల్ఫేర్ సిబ్బంది కందాల శంకరయ్య, రవీందర్‌రెడ్డి, వెంకటరమణ, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్‌పీఈయూ రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి శశికుమార్