
ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్న మృతుడి బంధువులు
వరంగల్ చౌరస్తా: వరంగల్ జేపీఎన్ రోడ్డులోని సత్య ఆస్పిటల్ ఎదుట ఆదివారం మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. వరంగల్ శివనగర్‌కు చెందిన మధు(42) మోకాళ్ల చిప్ప ఆపరేషన్ కోసం మూడు రోజుల క్రితం సత్య ఆస్పత్రిలో చేరాడు. శస్త్ర చికిత్స పూర్తయింది. అయితే మధు అకస్మాత్తుగా మృతి చెందడంతో అతడి బంధువులు వైద్యుడి నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆందోళనకు దిగా రు. వరంగల్ ఇంతేజార్‌గంజ్, మట్టెవాడ పోలీసులు చేరుకున్నారు. కనీసం కే షీట్స్, ఇతర రిపోర్టులు అడగ్గా వైద్యులు ఇవ్వడంలేదని మృతుడి బంధువులు నిరసన తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇంతేజార్‌గంజ్ సీఐ ముస్కె శ్రీనివాస్ తెలిపారు.