ఈనెల 20న రాష్ట్రవ్యాప్తంగా 14 పరీక్ష కేంద్రాలలో నిర్వహణ తత్కాల్ ఫీజు రూ.500తో నేరుగా పరీక్ష రాసేందుకు అవకాశం
ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూ దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను రెండేళ్ల మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ), మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేష న్స్ (ఎంసీఏ) కోర్సుల ప్రవేశ పరీక్ష ఈనెల 20వ తేదీన నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు, పరీక్షల కోఆర్డినేటర్ ప్రొఫెసర్ దిట్టకవి రామచంద్రన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 14 కేంద్రాలలో ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆదివారం మధ్యాహ్నం 12 గంటల లోపు పూర్తి చేయాలని సూచించారు. సంబంధిత పత్రాలను పరీక్ష కేంద్రంలో చూపించాలని తెలిపారు. ఒకవేళ దరఖాస్తులు అందించని అభ్యర్థులు నేరుగా అభ్యర్థి ఆధార్ కార్డు, ఫొటోతోపాటు రూ.500 తత్కాల్ ఫీజు చెల్లించి పరీక్ష కేంద్రాల్లో నేరుగా హాజరు కావచ్చన్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమకు కేటాయించిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కేంద్రంతో పాటు దగ్గరలో ఉన్న పరీక్ష కేంద్రానికి వెళ్లి కూడా పరీక్షకు హాజరు కావచ్చని తెలిపారు. అభ్యర్థులు అవసరమైన పత్రాలు వెంట తీసుకురావాలని సూచించారు
ప్రవేశ పరీక్ష కేంద్రాలు
సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (గుంటూరు), ఆదిత్య డిగ్రీ కాలేజ్ (కాకినాడ), ఎంఎస్‌ఆర్‌ఎస్ సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ (విశాఖపట్నం), గీతం డిగ్రీ కాలేజ్ (ఒంగోలు), గేట్ డిగ్రీ కాలేజ్ (తిరుపతి), శ్రీ కృష్ణవేణి ఐటీఐ కాలేజ్ (కర్నూలు), ఇంటెల్ ఇంజినీరింగ్ కాలేజ్ (అనంతపురం), విజ్ఞాన్ డిగ్రీ కాలేజీ (కై కలూరు), చక్రధర్ డిగ్రీ కాలేజ్ (మాచర్ల), ఎిస్బీఎస్‌వైఎం డిగ్రీ కాలేజ్ (మైదుకూరు), ప్రభాస్ డిగ్రీ కాలేజీ (విజయవాడ), శాంతినికేతన్ డిగ్రీ కాలేజీ (శ్రీకాకుళం), గీతాంజలి డిగ్రీ కళాశాల (భీమడోలు), శ్రీ నేతాజీ డిగ్రీ కళాశాల సంఘం (నెల్లూరు) కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష జరుగుతుందని వివరించారు. ఈ నెల 20న జరగనున్న ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను ఈ నెల18 నుంచి అభ్యర్థులతు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు తెలిపారు.


