గుంటూరు ఎడ్యుకేషన్: ఉత్తమ ప్రతిభతో షైనింగ్ స్టార్లుగా నిలిచిన విద్యార్థులు జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ అన్నారు. పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందిస్తూ ‘షైనింగ్ స్టార్స్ – 2026‘ కార్యక్రమాన్ని సోమవారం పొన్నూరు రోడ్డులోని బీ కన్వెన్షన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా టెన్త్‌లో 137, ఇంటర్మీడియట్‌లో 40 మంది చొప్పున విద్యార్థులకు సన్మానం చేశారు. రూ.20 వేల చొప్పున నగదు బహుమతి, పతకం, ధ్రువపత్రం బహూకరించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... రాష్ట్రంలో మంచి విద్యా వ్యవస్థ ఉందన్నారు. ఈ విద్యార్థుల తల్లిదండ్రులు స్ఫూర్తిప్రదాతలు అన్నారు. ఎమ్మెల్యేలు ఎండీ నసీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు, డీఈఓ షేక్ సలీమ్ బాషా, ఇంటర్ ఆర్జేడీ జె.పద్మ, ఆర్‌ఐవో జి.సునీత, సమగ్రశిక్ష ఏపీసీ వి.పద్మావతి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, తహసీల్దార్ సుభాని, డీవైఈవోలు, ఎంఈవోలు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ


